'డిజిటల్ యాప్‌లో ధూళిపాళ్ల పై ఫిర్యాదు చేస్తా'
GNTR: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన డిజిటల్ యాప్‌లో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పై ఫిర్యాదు చేస్తానని శనివారం వైసీపీ పొన్నూరు ఇన్‌ఛార్జ్ అంబటి మురళీ ప్రకటించారు. ధూళిపాళ్ల కారణంగా పొన్నూరులో వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని, తనపై 9 అక్రమ కేసులు బనాయించారనే విషయాన్ని ఆ ఫిర్యాదులో ప్రస్తావిస్తానని తెలిపారు.