బాలుడిపై కోతి దాడి
NGKL: పదర మండలం చిట్లంకుంటకు చెందిన సామర్ల ఆర్యన్(5) బాలుడు ఇంటి ముందు ఆడుతుండగా కోతి అతనిపై దాడి చేసింది. చేతి వేళ్ళని కొరికింది, బాలుడు భయపడి అరవడంతో కోతి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. గ్రామంలో చాలా రోజులుగా కోతుల సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో ఎటు చూసినా కోతుల గుంప్పే ఉండడంతో చిన్నారులు బయటకి రావడానికి భయపడుతున్నారు.