జగన్‌కు రాజకీయ అనుభవం లేదు: KUDA ఛైర్మన్

కుటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే సూపర్ సిక్స్-సూపర్ హిట్ అయ్యిందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళ్లు తెరిచి చూడాలని KUDA ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. కార్యలయంలో ఆయన మాట్లాడుతూ.. జగన్‌కు రాజకీయ అనుభవం లేదని, ఇష్టానుసారంగా మాట్లాడడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.