పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి

పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి

KMR: రైతులు సాగు చేసిన పంటలను తాడ్వాయి మండల వ్యవసాయ అధికారి నరసింహులు శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. తాడ్వాయిలోని బ్రాహ్మణపల్లి, దేవాయిపల్లి గ్రామాల్లో రైతులు సాగుచేసిన పత్తి పంటను ఆయన పరిశీలించి, రైతులకు పలు సలహాలు, సూచనలు అందజేశారు. పంటకు సోకే పురుగు నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. పంటల్లో నీరు నిలవకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలనీ సూచించారు.