రేపు జిల్లాలో పర్యటించనున్న ఎంపీ
E.G: రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8:30 నుంచి 11:00 వరకు హోటల్ మంజీరా సరోవర్‌లో IKCA ఆధ్వర్యంలో జరిగే 1వ అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్ 2026 ప్రెస్ కాన్ఫరెన్స్, లోగో & జెర్సీ ఆవిష్కరణలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని పార్టీ కార్యాలయం తెలిపింది.