సింహాచలం ఘటన పై స్పందించిన ఛైర్మన్

VZM: సింహాచలంలో జరిగిన ఘటన దురదృష్టకరమని అంతమంది భక్తులు చనిపోవడం బాధ కలిగిస్తోందని DCCB ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. గురువారం చీపురుపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై బొత్స లాంటి సీనియర్ నాయకులు కూడా శవ రాజకీయాలు చేయడం భావ్యం కాదన్నారు. ప్రజల మంచి చెడులను ఆలోచించి, వారిని సురక్షితంగా ఉంచాలని నిరంతరం ఆలోచించే ప్రభుత్వం ఇదని తెలిపారు.