జిల్లాలో పెరుగుతున్న చలి తీవ్రత

జిల్లాలో పెరుగుతున్న చలి తీవ్రత

RR: మారుతున్న వాతావరణానికి తోడు చలి వణికిస్తోంది. తెల్లవారుజామున జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో పది రోజులుగా చలి తీవ్రత మరింత పెరగడంతో దీర్ఘకాలిక రోగులకు ఇబ్బందికరంగా మారింది. దీనికి తోడు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం, ఆయాసం కేసులు పెరుగుతున్నాయని వైద్యులు తెలిపారు.