'కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలి'
HNK: స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు విభేదాలను మరిచి సమన్వయంతో పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేయాలని మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి ముఖ్య నాయకుల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొడ్డు ప్రభుదాస్, కర్ర సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.