ఈనెల 19న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష
VKB: 2026-27 విద్యా సంవత్సరానికి గాను బంట్వారం మోడల్ స్కూల్లో 6వ తరగతిలో అడ్మిషన్స్ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష ఈ నెల 19 న నిర్వహిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరూ హాల్ టికెట్, ఆధార్ కార్డుతో ఆదివారం ఉదయం 9.30 గంటల వరకు పరీక్షా కేంద్రంలో హాజరుకావాలని ప్రిన్సిపల్ బ్యూలా తెలిపారు.