వాలీబాల్ టోర్నమెంట్‌కు కామారెడ్డి క్రీడాకారుడి ఎంపిక

వాలీబాల్ టోర్నమెంట్‌కు కామారెడ్డి క్రీడాకారుడి ఎంపిక

KMR: సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పురుషుల వాలీబాల్ టోర్నమెంట్‌కు కామారెడ్డి గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల విద్యార్థి మలోత్ రవీందర్ ఎంపికయ్యాడు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస స్వామి, ఫిజికల్ డైరెక్టర్ అనిల్‌లు మంగళవారం రవీందర్‌ను ఘనంగా అభినందించారు. నేటి విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాలని వారు ఈ సందర్భంగా సూచించారు.