కూరగాయల సాగుకు ముందుకు రావాలి: శేఖర్

కూరగాయల సాగుకు ముందుకు రావాలి: శేఖర్

ADB: రైతులు కూరగాయల పంటలను పండించడానికి ముందుకు రావాలని ఉద్యానవన అధికారి శేఖర్ అన్నారు. శనివారం గుడిహత్నూర్ మండలంలోని కోలహరి గ్రామంలో గ్రామస్తులతో కలిసి రైతులకు కూరగాయల కిట్ లను పంపిణీ చేశారు. పత్తి, చేనుగ, కందులతోపాటు అంతర పంటలుగా కూరగాయలను సాగు చేయాలని సూచించారు. గ్రామస్తులు రాజన్న, మారుతి, రాజారాం, రామకిషన్, తదితరులు ఉన్నారు.