VIDEO: రైతులకు సంఘీభావంగా ధర్నాలో పాల్గొన్న మాజీ ఎంపీ

MHBD: తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియాను ప్రభుత్వం తేవాలని మాజీ ఎంపీ మాలోతు కవిత డిమాండ్ చేశారు. నెల్లికుదురు మండల కేంద్రంలో యూరియా బస్తాలు ఇవ్వాలని బుధవారం రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ క్రమంలో కవిత వారికి సంఘీభావం తెలిపి, వారితోపాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.