జనసేన కార్యకర్త కుటుంబానికి ప్రమాద బీమా అందజేత

జనసేన కార్యకర్త కుటుంబానికి ప్రమాద బీమా అందజేత

SKLM: బూర్జ ,పొందూరు మండలాల్లో జనసేన పార్టీ చెందిన పలువురు క్రియాశీలక కార్యకర్తలు ఇటీవల ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆ కుటుంబాలను ఆదుకునేందుకు ఆదివారం తాడేపల్లిలో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు వారి కుటుంబ సభ్యులకు రూ. 5,00,000 ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఆమదాలవలస నియోజకవర్గ ఇంఛార్జ్ పి. రామ్ మోహన్ ఉన్నారు.