రైతులకు ఎరువుల పంపిణీ

SKLM: సోంపేట మండలం పాలవలస సచివాలయం వద్ద సోమవారం ఎరువుల బస్తాలను పంపిణీ చేశారు. సచివాలయం వ్యవసాయ అధికారి ప్రతీప్, మాజీ జెడ్పీటీసీ సూరాడ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఒక ఎకరాకు ఒక యూరియా, ఒక డీఏపీ బస్తా ఇస్తున్నామని అన్నారు. కావున ఈ ఎరువుల విక్రయానికి రైతులు ఆధార్ కార్డు, 1బి తీసుకురావాలని కోరారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఎరువుల పంపిణీ చేస్తామన్నారు.