ఘనంగా పోచమ్మ బోనాల కొలుపులు

ఘనంగా పోచమ్మ బోనాల కొలుపులు

ఆదిలాబాద్: కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామంలో ఆదివారం గ్రామ మాజీ సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు బోనాలతో ఊరేగింపు నిర్వహించి నైవేద్యాలను పోచమ్మ ఆలయంలో సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నారిశెట్టి వెంకయ్య, కొత్త రమేష్, పంబాల తిరుపతి, కంచర్ల పద్మ తదితరులు పాల్గొన్నారు.