VIDEO: 'అర్హులందరికీ దశలవారీగా ఇండ్లు అందజేస్తాం'

MLG: ములుగు మండలం మదనపల్లి గ్రామంలో బుధవారం కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క హాజరై, భూమి పూజ చేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం చేపట్టామని మంత్రి సీతక్క తెలిపారు. అర్హులందరికీ దశలవారీగా ఇండ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు.