ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చిన రాపాకపల్లి గ్రామస్థులు

JN: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే డా.తాటికొండ రాజయ్యను మంగళవారం రాపాకపల్లి గ్రామస్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వారు పలు అభివృద్ధి పనులను పూర్తి చేయాలని వినతిపత్రంను సమర్పించారు. స్పందించిన ఎమ్మెల్యే 10 రోజుల వ్యవధిలో ఉనికిచర్ల- రాపాకపల్లి బీటీ రోడ్ వర్క్ పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారు.