సోమవారం నిర్వహించే PGRS రద్దు: కలెక్టర్
E.G: సోమవారం నిర్వహించే పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ (PGRS) కార్యక్రమం రద్దైనట్లు కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సోమ, మంగళవారం ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలకు సెలవు దినంగా ప్రకటించినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రజలు తమ ఫిర్యాదులు టోల్ ఫ్రీ నెంబర్ 1100 లేదా మీ కోసం వెబ్ సైట్ ద్వారా అర్జీలు సమర్పించవచ్చన్నారు.