విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: బీసీ విద్యార్థి సంఘం
SRPT: జిల్లాలోని విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం నాయకుడు పచ్చిపాల రామకృష్ణ యాదవ్ జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. హాస్టళ్లలో కనీస వసతులు మెరుగుపరచాలని, పెండింగ్ నిధులను తక్షణమే చెల్లించాలని వారు కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు.