డ్రోన్ నిఘాతో నిఘా.. పేకాట రాయుళ్లు అరెస్ట్
ATP: గుంతకల్ మోదీనాబాద్ సమీపంలో డ్రోన్ సాయంతో వన్ టౌన్ పోలీసులు మంగళవారం నిర్వహించిన దాడిలో ఆరుగురు పేకాటరాయుళ్లు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.16,600 నగదు, పేకముక్కలను సీఐ మనోహర్ బృందం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.