జగన్ తప్పుడు బిల్లులు పెట్టి మోసం చేశారు: కేంద్రమంత్రి

AP: కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునే విషయంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. సీఎం జీవీకే, పీఎం సూర్యఘర్ పథకాల అమలు, క్షేత్రస్థాయి సమస్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. మైనారిటీలకు అవసరమైన సౌకర్యాలు కల్పించే పీఎం జీవీకే పథకంలో జగన్ తప్పుడు బిల్లులు పెట్టి మోసం చేశారని ఆరోపించారు.