కడప మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్
AP: కడప మేయర్ ఎన్నిక కోసం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదితి సింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 11న ఉదయం 11 గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ ఇటీవల కడప మేయర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు జేసీ నోటిఫికేషన్ ఇచ్చారు.