నేటి నుంచి ఎస్సారెస్పీ నీటి సరఫరా నిలిపివేత

నేటి నుంచి ఎస్సారెస్పీ నీటి సరఫరా నిలిపివేత

JGL: ఎస్సారెస్పీ కాలువల ద్వారా జగిత్యాల జిల్లాలో యాసంగి సాగుకు అందిస్తున్న నీటి సరఫరాను బుధవారం నుంచి నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వారబందీ పద్ధతిలో 8 రోజులు విడుదల, 7 రోజులు విరామం ఇస్తూ ప్రభుత్వం నీటిని అందజేసింది. వేసవిలో వరి పంటలు చివరి దశకు చేరుకోవడంతో ప్రధాన కాలువతో పాటు అన్ని డిస్ట్రిబ్యూటరీలకు సాయంత్రం నుంచి నిలిపివేస్తారు.