గాంధీభవన్ ముందు పాలకుర్తి కాంగ్రెస్ శ్రేణుల నిరసన

వరంగల్: పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు ఈరోజు హైదరాబాద్ గాంధీభవన్ ఎదుట ఆందో ళన చేపట్టారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, నియోజకవర్గ ఇంఛార్జ్ ఝాన్సీరెడ్డి తీరుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేవరుప్పుల పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ తొలగింపుతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగినట్లు వివరించారు.