ఆయనకు 61 ఏళ్లు.. 100 సార్లు రక్తదానం

ఆయనకు 61 ఏళ్లు.. 100 సార్లు రక్తదానం

NRML: అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మిన్న అని పెద్దలు ఊరికే అనలేదని, అత్యవసర సమయాల్లో అది ప్రాణాలు నిలబెడుతుందని నిరూపించారు జిల్లా కేంద్రానికి చెందిన గంగిశెట్టి ప్రవీణ్. రక్తదానం చేయడానికి చాలా మంది భయపడే ఈ రోజుల్లో, ప్రవీణ్ తన జీవితంలో ఇప్పటి వరకు 100 సార్లు రక్తదానం చేసి ఎంతో మందికి ప్రాణదాతగా నిలిచారు. ఈయన అందరికీ ఆదర్శంగా నిలిచారు.