ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ

NRPT: నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 11 అర్జీలు అందినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఫిర్యాదులు చేసేందుకు వచ్చిన బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిశీలించి చట్టం ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తామని బాధితులకు భరోసా కల్పించారు.