కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న 'బైకర్' టీమ్
శర్వానంద్ హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం 'బైకర్'. ఈ సినిమా బృందం ఇవాళ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంది. ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర బృందం ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్రల్లో నటించాడు.