ఆసిఫాబాద్ కలెక్టర్ ఈఎస్‌ఐ ఆసుపత్రి తనిఖీ

ఆసిఫాబాద్ కలెక్టర్ ఈఎస్‌ఐ ఆసుపత్రి తనిఖీ

ASF: జిల్లా కలెక్టర్ శ్రీమతి కె.హరిత కాగజ్‌నగర్‌లోని ఈఎస్‌ఐ (ESI) ఆసుపత్రి, డిస్పెన్సరీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధులకు గైర్హాజరైన సిబ్బందిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, క్రమశిక్షణా చర్యలకు ఆదేశించారు. ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు, మెరుగైన వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.