TDP నాయకుడి హత్య.. నలుగురు అరెస్ట్

TDP నాయకుడి హత్య.. నలుగురు అరెస్ట్

AP: టీడీపీ నాయకుడిని హత్య చేసిన కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. గత నెల 27న తిరుపతి జిల్లా నాయుడిపేట మండలం ద్వారకాపురం వద్ద గురుమూర్తిని హత్య చేశారు. అత్తివరానికి బైక్‌పై వెళ్తుండగా పథకం ప్రకారం వాహనంతో ఢీకొట్టారు. దీంతో గురుమూర్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ కేసులో పోలీసులు తాజాగా నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.