'మద్యం దుకాణాలు సమయపాలన పాటించాలి'

'మద్యం దుకాణాలు సమయపాలన పాటించాలి'

KDP: ప్రొద్దుటూరులో బార్లు, మద్యం దుకాణాల యజమానులు సమయపాలన పాటించాలని సీఐ రామాంజనేయుడు ఆదేశించారు. గురువారం సాయంత్రం ఎస్సై మైనుద్దీన్‌తో కలిసి ఆయన పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. నేరాల కట్టడికి ప్రతి దుకాణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిరంతరం పనిచేసేలా బ్యాకప్ ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.