నాగలాపురంలో వాహనాల తనిఖీలు
TPT: నాగలాపురంలోని బజారు వీధిలో ఆదివారం SI ప్రసాద్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు వాహనదారులు తప్పనిసరిగా సరైన ధృవపత్రాలు కలిగి ఉండాలని సూచించారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరిస్తూ, నంబర్ ప్లేట్ లేకుండా రోడ్డుపై నడిపే వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల భద్రత కోసం ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.