'పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత'

'పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత'

KDP: గ్రామంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత అని సర్పంచ్ జానకిరామయ్య అన్నారు. సిద్దవటం మండలంలోని మాధవరం-1 గ్రామంలో శుక్రవారం ప్రజలకు మురుగునీటిపై అవగాహన కల్పించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. మురుగునీరు వదలడం వలన పారిశుద్ధ్య లోపం ఏర్పడి ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉంటుందన్నారు. బహిరంగంగా మురుగునీరు విడుదల చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.