VIDEO: పట్టిసీమలో కార్మికులు నిరసన

W.G: పోలవరం మండలం పట్టిసీమలో శుక్రవారం శ్రీ సత్యసాయి మంచినీటి పథకం కార్మికులు నిరసన సమ్మె చేపట్టారు. గత పది నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వానికి, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఫలితం లేదని అన్నారు. ఈ సమ్మెకు పలు కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి.