మహంకాళి ఏసీపీపై బదిలీ వేటు

మహంకాళి ఏసీపీపై బదిలీ వేటు

HYD: మహంకాళి ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న సైదయ్యపై బదిలీ వేటు పడింది. ఇటీవల అతనిపై అవినీతి ఆరోపణల రావడంతో ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన్ని సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వు హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గోపాలపురం ఏసీపీకి మహంకాళి ఏసీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.