'విద్యార్థులు ఇష్టపడి చదవాలి'
AKP: విద్యార్థులు ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చునని డిప్యూటి డీఈవో అప్పారావు సూచించారు. కసింకోట జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న బ్రిడ్జ్ కోర్స్ తరగతులను పరిశీలించారు.9వ తరగతి నుంచి పదవ తరగతికి వస్తున్న విద్యార్థుల కోసం బ్రిడ్జ్ కోర్స్ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. పది సిలబస్ పై క్లాసులు జరుగుతున్నాయన్నారు.