రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ రైతు మృతి

రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ రైతు మృతి

KNR: కరీంనగర్(R) పోలీస్ స్టేషన్ పరిధిలోని దురేడు బస్టాండ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగుంటపల్లికి చెందిన రైతు ఐలయ్య (65) మృతి చెందారు. గత శుక్రవారం మార్కెట్‌లో కూరగాయలు అమ్మి ద్విచక్ర వాహనంపై వస్తుండగా, గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆయన కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు.