జాగ్రత్త.. నదిలోకి దిగొద్దు

జాగ్రత్త.. నదిలోకి దిగొద్దు

NTR: ఇటీవల కాలంలో కురుస్తున్న వర్షాలకు విజయవాడలోని కృష్ణానదికి వరద ప్రవాహం పెరిగింది. భారీ మొసళ్లు, ప్రమాదకరమైన సుడి గుండాలు ఉన్నాయని, నదిలోకి దిగితే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని కృష్ణలంక పోలీసులు శుక్రవారం ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్లెక్సీ ఏర్పాటు చేశారు. నదిలోకి దిగవద్దని, పోలీసుల సూచనలను తప్పక పాటించాలన్నారు.