520 మంది ప్రాణాలను కాపాడాం: నేవీ చీఫ్

520 మంది ప్రాణాలను కాపాడాం: నేవీ చీఫ్

నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి భారత నౌకాదళం సత్తాను వివరించారు. ఎర్ర సముద్రంలో సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా 62 మంది పైరేట్లను పట్టుకున్నామని తెలిపారు. హౌతీ దాడుల వేళ 40 నౌకలను మోహరించి.. 6.5 బిలియన్ డాలర్ల విలువైన కార్గోను రక్షించామన్నారు. సముద్రంలో 30కి పైగా ఘటనల్లో స్పందించి ఏకంగా 520 మంది ప్రాణాలను కాపాడామని గర్వంగా చెప్పారు.