పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

MBNR: మూసాపేట మండల కేంద్రంలోని నేతాజీ యువజన సంఘం భవనంలో శనివారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం ప్రారంభమైంది. ఆవులు, గేదెలు ఉన్న రైతులు ఆధార్ కార్డుతో వచ్చి టీకాలు వేయించుకోవాలని వెటర్నరీ డాక్టర్ మధుసూదన్ సూచించారు. ఈ ఉచిత టీకా పంపిణీ నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని సర్పంచ్ మహేందర్ తెలిపారు.