MLC చొరవతో RTC బస్ సేవలు ప్రారంభం
ASF: కౌటాల మండలం విర్ధండి గ్రామానికి RTC బస్ సౌకర్యం ఆదివారం ప్రారంభం అయింది. తమ గ్రామానికి బస్ సౌకర్యం కల్పించాలని MLC విఠల్, RTC అధికారులను గతంలో గ్రామస్థులు కోరారు. ఈ క్రమంలో MLC చొరవతో అధికారులు స్పందించి ఆ గ్రామానికి బస్సు సేవలు అందించారు. సర్పంచ్ వనిత కొబ్బరికాయ కొట్టి బస్ ప్రారంభించారు. RTC సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.