సురక్షిత తాగునీటి సదుపాయం ప్రారంభం

సురక్షిత తాగునీటి సదుపాయం ప్రారంభం

PPM: వేసవి కాలంలో తీవ్ర నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని బేతనీ మిషన్ సొసైటీ ఆధ్వర్యంలో గడిగుడ్డి గిరిజన గ్రామంలో సురక్షిత తాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఈ మంచినీటి చేతి పంపును సంస్థ అధ్యక్షులు డా.శ్రీనివాసరావు గ్రామ ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.