పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: ఎంపీఓ

NRML: నర్సాపూర్ ( జి) మండల కేంద్రంలో మంగళవారం డ్రై డే సందర్భంగా పలు వార్డుల్లో ఎంపీఓ తిరుపతిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ట్యాంకులలో నిల్వ ఉన్న నీటిని సిబ్బందిచే పారబోయించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి రాథోడ్ కైలాస్, ఫీల్డ్ అసిస్టెంట్ విట్టల్ తదితరులున్నారు.