హెజ్‌బుల్లాపై లెబనాన్ ప్రధాని ఆగ్రహం
ఇజ్రాయెల్‌పై హెజ్‌బుల్లా జరిపిన రాకెట్ దాడులపై లెబనాన్ ప్రధాని నవాఫ్ సలామ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హెజ్‌బుల్లా చర్యలు బాధ్యతారాహితమైనవని ధ్వజమెత్తారు. హెజ్‌బుల్లా చర్యలను లెబనాన్‌పై ఇజ్రాయెల్ తన దురాక్రమణను కొనసాగించడానికి అవకాశం కల్పిస్తున్నాయని ఆగ్రహించారు. ప్రస్తుత యుద్ధంలోకి లెబనాన్‌ను లాగడాన్ని ఏ మాత్రం సహించబోమని వెల్లడించారు.