1160 మంది విద్యార్థులకు 794 మంది పాస్!
NLG: ఎంజీయూ పరిధిలో పీజీ 2వ సెమిస్టర్ ఫలితాలను ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ విడుదల చేశారు. సెప్టెంబర్‌లో జరిగిన పరీక్షలకు 1160 మంది విద్యార్థులు హాజరుకాగా, 794 మంది ఉత్తీర్ణులయ్యారని సీవోఈ డా. ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఫలితాలు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి తదితరులు పాల్గొన్నారు.