బైరమల్ గూడాలో విద్యుత్ శాఖ ముందు జాగ్రత్త చర్యలు

బైరమల్ గూడాలో విద్యుత్ శాఖ ముందు జాగ్రత్త చర్యలు

RR: రామంతపూర్, బండ్లగూడ ప్రాంతాల్లో కరెంట్ షాక్‌తో జరిగిన మరణాలను దృష్టిలో ఉంచుకొని బైరమల్ గూడాలో సెక్షన్ విద్యుత్ శాఖ అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. కాలనీల్లో క్రిందికి వేలాడుతున్న వైర్లను గుర్తించి వెంటనే కట్ చేసి సరిచేశారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు.