యువకుడు ఆత్మహత్య.. బంధువుల ఆందోళన
MHBD:సిరోల్ మండలం సీతళాతండాలో నేడు ధరంసోతూ సురేష్ అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటన తెలిసిన కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎదురింటి వారే మృతికి కారణం అంటూ బంధువులు ఆందోళన చేపట్టారు. దీంతో తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.