రైతులకు అందుబాటులో జీలుగ విత్తనాలు

MNCL: భీమారంలోని వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు ఏవో మార్క్ గ్లాండ్‌సన్ తెలిపారు. 30 కేజీల బ్యాగు ధర సబ్సిడీ కింద రూ. 1,116గా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. విత్తనాలు కావాల్సిన రైతులు ఆధార్, పట్టాదార్ పాస్ పుస్తకంతో క్లస్టర్ ఏఈవోలను సంప్రదించాలన్నారు.