VIDEO: గోకవరం మండలంలో భారీ వర్షం
E.G: తుఫాన్ ప్రభావం వల్ల గోకవరం మండలంలో మంగళవారం ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. ఈ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అధికారుల ఆదేశాల మేరకు మండల ప్రజానీకం ఇళ్లలోనే సురక్షితంగా ఉన్నారు. ఏది ఏమైనా ఈ తుఫాన్ కారణంగా తాము నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.