ఘనంగా ఎమ్మెల్యే ఎంజీఆర్ జన్మదినోత్సవ వేడుకలు
SKLM: మెలియాపుట్టి మండల కేంద్రంలోని శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో మండల టీడీపీ నాయకులు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు జన్మదినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ఎంజీఆర్ పేరిట పూజలు చేశారు. అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు సలాన మోహనరావు కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.