జిల్లాలో ఇవాళ నమోదైన వర్షపాత వివరాలు..!

SRCL: గురువారం ఉదయం 6 గంటల వరకు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూర్‌లో గరిష్ఠంగా 6.5 మి.మీల వర్షపాతం నమోదైంది. సిరిసిల్ల మండలంలోని పెద్దూరులో 4.0 మి.మీలు, గంభీరావుపేటలో 2.8 మి.మీల వర్షం పడింది. ఇతర ప్రాంతాల్లో 0.5 మి.మీల నుంచి 1.5 మి.మీల వరకు వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.